గరికపాటిపై దుష్ప్రచారం...! 21 h ago
TG: ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహారావు పై కొన్ని యూట్యూబ్ ఛానల్స్ లో వస్తున్న దుష్ప్రచారంపై ఆయన టీమ్ స్పందిస్తూ ఈ అసత్య ప్రచారాలకి ఆయన కుటుంబ సభ్యులు, అభిమానులు కూడా కలత పడుతున్నారని తెలిపారు. వీటిని తీవ్రంగా ఖండిస్తూ, మళ్లీ ఇలాంటి ప్రచారాలు చేస్తే యూట్యూబ్ ఛానళ్ల పై క్రిమినల్, పరువు నష్టం కేసులు పెడతారని హెచ్చరించారు.